Sunday, January 18, 2026
Homeనేషనల్CM Himanta Sarma : అవినీతిపై హిమంత బిస్వా శర్మ ఉక్కుపాదం.. 32 మంది...

CM Himanta Sarma : అవినీతిపై హిమంత బిస్వా శర్మ ఉక్కుపాదం.. 32 మంది అధికారులు అరెస్ట్

Assam : అవినీతి రహిత పాలనే లక్ష్యంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. అవినీతికి అస్సాంలో తావు లేదు అంటూ ఆయన ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం నాడు ఆయన చేసిన ప్రకటన ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

- Advertisement -

హిమంత స్టైల్ వార్నింగ్
ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తనదైన శైలిలో అవినీతిపై యుద్ధం ప్రకటించారు. సీధీ బాత్.. నో బక్వాస్ (సూటిగా చెబుతున్నా.. సోది మాటలు లేవు) అనే నినాదంతో అస్సాం ప్రభుత్వం అవినీతి పట్ల ఎంత కఠినంగా ఉందో ఆయన ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, గడిచిన ఏడాది కాలంలో తన ప్రభుత్వం సాధించిన ఫలితాలను కూడా ఆయన ప్రజల ముందు ఉంచారు.

రికార్డు స్థాయిలో అరెస్టులు
విజిలెన్స్ , అవినీతి నిరోధక డైరెక్టరేట్ గత ఏడాది అసాధారణ రీతిలో స్పందించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2023లో జరిగిన కీలక పరిణామాలు ఇవే..పక్కా ప్లాన్‌తో అవినీతి అధికారుల కోసం ఉచ్చులు పన్నిన విజిలెన్స్ విభాగం 29 భారీ ఆపరేషన్లను నిర్వహించింది.లంచం తీసుకుంటూ దొరికిపోయిన 32 మంది ప్రభుత్వ ఉద్యోగులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఇందులో చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి పెద్ద అధికారుల వరకు అందరినీ చట్టం ముందు నిలబెట్టారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో విచారణ నత్తనడకన సాగుతుంది. కానీ అస్సాం ప్రభుత్వం పట్టుబడిన ప్రతి ఒక్కరిపై 100 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసి, బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు వేగవంతం చేసింది.

EPF : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరగనున్న పీఎఫ్ జీత పరిమితి.. లక్షలాది మందికి లబ్ధి

 

అవినీతి చేస్తే మూల్యం తప్పదు
అవినీతిని ఏమాత్రం సహించం అనే బలమైన సందేశాన్ని హిమంత బిస్వా శర్మ పంపారు. అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటమే కాకుండా, వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని, సామాన్యులను ఇబ్బంది పెట్టే ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News