ఎన్‌హెచ్ ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం నుంచి రావల్సిన వాటా మొత్తాన్ని 2023, అక్టోబరు నుంచి తామే విడుదల చేస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఎన్ హెచ్ ఎం కింద తెలంగాణకు రావల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి