ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో సమావేశమయ్యారు. 10 జన్‌పథ్‌లో రాహుల్ నివాసంలో రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, కులగణన సర్వే నివేదిక, తదితర అంశాల గురించి చర్చించినట్లు సమాచారం. అలాగే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా చర్చించారని తెలుస్తోంది.
కుల గణన, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో త్వరలోనే సూర్యాపేట, గద్వాలలో భారీ బహింగ సభలను నిర్వహించనున్నట్లు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా రావాలని ఆయనను ఆహ్వానించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారల ఇంఛార్జ్ దీప్‌దాస్ మున్షిని మార్చి ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.