CM Vijay Good News to Government Employes: తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న కొత్త సీఎం విజయ్ తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 58 శాతం డీఏ (డియర్నెస్ అలవెన్స్)ను 60 శాతానికి పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఈ 2 శాతం అదనపు డీఏ.. 2026 జనవరి 1 నుండి వర్తిస్తుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందిస్తోందని, ఈ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో, విజయవంతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 1, 2026 నుండి డీఏను 60 శాతానికి పెంచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-comments-on-neet-paper-leak/
ఏటా 1,230 కోట్ల రూపాయల అదనపు భారం..
ఈ జీతాల పెంపు వల్ల తమిళనాడులోని దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నేరుగా లబ్ధి పొందనున్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి 1,230 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. అయినప్పటికీ, ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అదనపు నిధులను వెచ్చించడానికి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

