HomeTop StoriesVijay- Stalin: స్టాలిన్‌ నివాసానికి సీఎం విజయ్‌.. రాష్ట్ర అంశాలపై చర్చ

Vijay- Stalin: స్టాలిన్‌ నివాసానికి సీఎం విజయ్‌.. రాష్ట్ర అంశాలపై చర్చ

Vijay- Stalin Meeting: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సోమవారం మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి భేటీ ఇదే. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఇరు నేతలూ చర్చించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/bjp-chief-about-pocso-case-against-bandi-bhagirath/

స్టాలిన్ నివాసానికి చేరుకున్న విజయ్‌కు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సాదర స్వాగతం పలికారు. స్టాలిన్‌ శాలువా కప్పి సత్కరించారు. అయితే ఈ సమావేశాన్ని కేవలం మర్యాదపూర్వక భేటీగా వర్ణిస్తున్నా.. రాష్ట్ర రాజకీయాల్లో ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య ఉండే వైరాగ్య సంస్కృతికి భిన్నంగా, విజయ్ మాజీ ముఖ్యమంత్రిని కలిసి కొత్త సంప్రదాయానికి తెరలేపారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ భేటీ ఐదు నిమిషాల్లోనే ముగిసింది. అనంతరం విజయ్ ఎండీఎంకే నేత వైగో, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌లను కూడా కలిసే అవకాశం ఉంది. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-naidu-meets-union-home-minister-amit-shah/

కాగా, టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగర్(118) రాకపోవడంతో, డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే వంటి పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News