HomeTop StoriesCM Vijay: పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య ఉదంతం.. సీఎం విజయ్‌ తీవ్ర ఆగ్రహం

CM Vijay: పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య ఉదంతం.. సీఎం విజయ్‌ తీవ్ర ఆగ్రహం

CM Vijay about Girl Kidnap: తమిళనాడులోని కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్‌, హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం విజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అమానవీయ ఘటనలను మన సమాజం ఎన్నటికీ క్షమించబోదని స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండించారు. బాలిక హత్య ఘటనలో పోలీసులు విచారణను వేగవంతం చేశారని.. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీఎం విజయ్‌ తెలిపారు. త్వరితగతిన విచారణ చేపట్టి దోషులకు శిక్ష పడేలా చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/minister-ponguleti-comments-on-harish-rao-about-future-city/

కోయంబత్తూరులో గురువారం(మే 21) నాడు ఇంటి సమీపంలోని కిరాణ షాపులో సామగ్రి కొనేందుకు వెళ్లిన పదేళ్ల బాలికను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆ తర్వాత కన్నంపాలయం చెరువు సమీపంలో లైంగిక దాడికి యత్నించగా.. బాలిక కేకలు వేయడంతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు చెరువు సమీపంలో బాలిక విగతజీవిగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను గుర్తించారు. శనివారం తెల్లవారుజూమున వారిని అరెస్టు చేశారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/mla-arava-sridhar-resigns-whip/

ఈ దుర్ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతురు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాగా, విజయ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఇలాంటి దుర్ఘటన జరగడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలు, చిన్నారుల భద్రతకు సరైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News