Homeనేషనల్CNG: మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు

CNG: మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు

CNG prices: దిల్లీలో వాహనదారులపై సీఎన్‌జీ భారం మరింత పెరిగింది. సామాన్యుడికి షాక్ ఇస్తూ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో కిలో సీఎన్‌జీపై రూ. 2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో దిల్లీలో ఇప్పటివరకు కిలో రూ. 81.09గా ఉన్న సీఎన్‌జీ ధర.. ఇప్పుడు రూ. 83.09 కి చేరింది. గత రెండు వారాల వ్యవధిలోనే సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సతమతమవుతున్న వాహనదారులు.. ముఖ్యంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లపై తాజా సీఎన్‌జీ ధరల పెరుగుదల మరింత అదనపు భారాన్ని మోపనుంది.

- Advertisement -

ధరల పెరుగుదలకు కారణం ఇదే: పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలే ఈ తాజా ధరల పెంపునకు ప్రధాన కారణం. అక్కడ ఘర్షణలు ప్రారంభం కావడానికి ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 72 డాలర్లుగా ఉండేది. కానీ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల వల్ల సరఫరాపై ప్రభావం పడి.. అది ఏకంగా 86 డాలర్లకు చేరుకుంది. గ్యాస్ దిగుమతి ఖర్చులు మరియు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ ఒడిదొడుకుల వల్లే కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపై వేయాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News