Sunday, October 6, 2024
Homeనేషనల్condoms in school bags : స్కూల్ పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు,సిగరెట్లు.....

condoms in school bags : స్కూల్ పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు,సిగరెట్లు.. షాకైన టీచర్లు

స్కూల్ కి వెళ్లే పిల్లల బ్యాగుల్లో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లతో పాటు.. తినుబండారాలు ఉండటం కామన్. కానీ.. కండోమ్స్, సిగరెట్లు, గర్భనిరోధక మాత్రలు ఉంటే ? ఇది నిజంగా షాకవ్వాల్సిన విషయమే. 8,9,10 తరగతులు చదివే పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, సిగరెట్లు, గర్భనిరోధక మాత్రలు, లైటర్లు, వైట్ నర్లుతో పాటు వాటర్ బాటిళ్లలో మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో వెలుగుచూసింది. తరగతి గదులలోకి విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నారని సమాచారం రావడంతో.. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయాలని స్కూళ్ల యాజమాన్యాలను కర్నాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (కేఏఎంఎస్‌) ఆదేశించింది.

- Advertisement -

ఈ మేరకు పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేసిన టీచర్లకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. 8,9,10 తరగతులు చదివే పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, సిగరెట్లు, గర్భనిరోధక మాత్రలు, లైటర్లు, వైట్ నర్లు, అధికమొత్తంలో నగదు కనిపించాయి. కొందరు విద్యార్థుల వాటర్ బాటిళ్లలో మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఒక విద్యార్థి బ్యాగ్ లో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు (ఐ-పిల్‌) లభించాయని, అలాగే వాటర్‌ బాటిల్‌లో మద్యం దొరికిందని కేఏఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి శశికుమార్‌ వెల్లడించారు. దాంతో అలర్టైన స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చాయి. పిల్లల భవిష్యత్ కోసం సంపాదనలో పడి ప్రస్తుతం వాళ్లు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ ఘటన కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తమ పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు దొరికాయని తెలిసి తల్లిదండ్రులు సైతం నివ్వెరపోయారు. ఇవేవీ తమకు తెలీదన్నారు. ఇకనైనా పిల్లల కార్యకలాపాలపై దృష్టి సారించాలని, వీలైనంత వరకూ స్మార్ట్ ఫోన్ చేతికివ్వొద్దని హెచ్చరించాయి. తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర నిఘా ఉంచాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ వయసులోనే పిల్లలు వీటికి అలవాటుపడటం భవిష్యత్ కు ఎంతమాత్రం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News