Congress calls for protests in Tamil Nadu: తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో ఉన్న టీవీకే ఛీప్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. అయితే, మెజార్టీ స్థానాలు దక్కించుకున్న విజయ్ పార్టీ పట్ల గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ముందు డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్.. తెగదెంపులు తెంచుకొని విజయ్ టీవీకే జతకట్టింది. దీంతో, ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను పిలవడం లేదనే కారణంతో శుక్రవారం తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. మోదీ, అమిత్ షా ఒత్తిడి వల్లే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. లోక్‌భవన్‌లో బలం నిరూపించుకోవాలని కోరే హక్కు గవర్నర్‌కు లేదని తెలిపారు. తమిళనాడు గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. విజయ్‌ను ఆహ్వానించడం మినహా గవర్నర్‌కు మరో మార్గం లేదని స్పష్టం చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanths-convoy-travels-without-halting-traffic/

