HomeTop StoriesKarnataka CM : కర్ణాటక సీఎం మార్పుపై జోరుగా చర్చ.. సిద్ధరామయ్యకు ఢిల్లీలో ఆ పదవి...

Karnataka CM : కర్ణాటక సీఎం మార్పుపై జోరుగా చర్చ.. సిద్ధరామయ్యకు ఢిల్లీలో ఆ పదవి ఆఫర్‌?

Congress clarity on Karnataka CM change: కర్ణాటకలో గత కొంతకాలంగా సీఎం మార్పుపై వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖండించింది. అవన్నీ ఊహాగానాలేనని తెల్చి చెప్పింది. ఢిల్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో పార్టీ అధిష్ఠానం తీవ్ర స్థాయిలో మంతనాలు నిర్వహించింది. చర్చల అనంతరం కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. రాజ్యసభ ఎన్నికలపైనే తమ మధ్య చర్చ సాగిందని, సీఎం మార్పుపై చర్చించలేదని స్పష్టం చేశారు. సీఎం మార్పుపై తప్పుడు వార్తలు, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు.

- Advertisement -

Also read: Shamirpet Tahsildar: రూ. 2 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి పట్టుబడ్డ శామీర్‌పేట్ తహసిల్దార్‌

ఢిల్లీలో మరింత పెద్ద పదవి ఇస్తాం..

అయితే, పార్టీ మీటింగ్‌లో సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్‌ పెద్దలు సిద్ధరామయ్యకు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. ఢిల్లీలో మరింత పెద్ద పదవి ఇస్తామని ఆఫర్‌ చేసినట్లు తెలిపాయి. పార్టీ సమస్యలు తాము చూసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, రాజ్యసభ ఎంపీగా మల్లికార్జున ఖర్గే సభ్యత్వం ముగియనుండటంతో ఆయన స్థానంలో సిద్దరామయ్యను రాజ్యసభకు పంపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు, మల్లికార్జున ఖర్గే స్థానంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా నియమించే ఛాన్స్‌ కూడా ఉందని తెలుస్తోంది. అయితే, రాజీనామా విషయంపై సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News