కాంగ్రెస్ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యల కారణంగా ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం సాయంత్రం ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.
కాగా కొంతకాలంగా సోనియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. 78 ఏళ్లు నిండిన సోనియా గాంధీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 13న బహిరంగంగా చివరిసారి కనిపించారు. ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని హస్తం పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.