అత్యాచారం కేసులో ఓ ఎంపీ అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ(Congress MP) రాకేశ్ రాథోడ్(Rakesh Rathore)పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కాల్ రికార్డింగ్‌లను కూడా సమర్పించింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతుండగా అరెస్ట్ చేశారు.
అంతకుముందు ఈ కేసు నుంచి రక్షణ కల్పించాలంటూ ఎంపీ రాకేశ్ రాథోడ్ అలహాబాద్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో పోలీసులు ఎంపీని అరెస్టు చేశారు. ఎంపీ అరెస్టుపై కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు.