Wednesday, October 30, 2024
Homeనేషనల్Sukesh-Arvind Kejriwal: సుఖేష్ సంచలన ఆరోపణలు.. సీఎం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

Sukesh-Arvind Kejriwal: సుఖేష్ సంచలన ఆరోపణలు.. సీఎం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ గట్టిగానే ఉచ్చు బిగుస్తోంది. ఘరానా మోసగాడు, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) బాయ్ ఫ్రెండ్ సుఖేష్ చంద్రశేఖర్ ఆమ్ ఆద్మీ పార్టీపై రోజూ కొత్త ఆరోపణలు చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. 20 మిలియన్ డాలర్ల కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చి తనకు సాయం చేయాలంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ నేత సత్యేంద్ర జైన్ తనను కోరినట్టు తాజాగా వెల్లడించాడు సుఖేష్.

- Advertisement -

తనను చాలా పెద్ద సాయాల కోసం AAP పదేపదే సంప్రదించిందని సుఖేష్ చెప్పటంతో కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. సుఖేష్ తో నిజంగానే ఆప్ నేతలకు ఇంత లోతైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయంటూ అంటూ ఢిల్లీ వాసులు షాక్ తింటున్నారు. తాను చేస్తున్న ఆరోపణలపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తే ఆప్ కు తాను చేసిన భారీ ఆర్థిక సాయాలన్నీ వెలుగులోకి వస్తాయని, కేజ్రీవాల్, ఆయన వెంట ఉన్న నేతల నిజరూపం వెలుగులోకి వస్తుందని సుఖేష్ సవాల్ చేస్తున్నారు.

తాను ఎటువంటి టెస్టులకైనా సిద్ధమని కూడా సుఖేష్ చెప్పటం ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా సుఖేష్ ఆరోపించటం హైలైట్. జైల్లో అన్ని సదుపాయాలు పొందేందుకు కూడా తాను ఆప్ నేతలకు భారీ మొత్తాన్నిచెల్లించినట్టు CBI విచారణ జరిపితే ఇవన్నీ సాక్షాధారాలతో బయటపడతాయని సుఖేష్ చంద్రశేఖర్ చెప్పటం సంచలనం సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News