Friday, September 20, 2024
Homeనేషనల్Covid 19 : మా దగ్గరి నుండే కరోనా వ్యాపించింది.. అసలు విషయం బయటపెట్టిన సైంటిస్ట్

Covid 19 : మా దగ్గరి నుండే కరోనా వ్యాపించింది.. అసలు విషయం బయటపెట్టిన సైంటిస్ట్

రెండేళ్ల క్రితం చైనా నుండి వ్యాపించిన కరోనా మహమ్మారి.. సుమారు ఏడాదికి పైగా ప్రపంచాన్నంతటినీ గడగడలాడించింది. కోట్లాదిమంది ఈ వైరస్‌ బారిన పడగా.. లక్షలాది మంది బలయ్యారు. ఇప్పటికీ ఈ కంటికి కనిపించని వైరస్ తో పోరాడుతూనే ఉన్నాం. కరోనా వ్యాపించడం మొదలైనప్పటి నుండి.. దాని వ్యాప్తికి కారణం చైనానే అన్న వాదనలు బలంగా వినిపించాయి. కొందరు అక్కడి జంతువల నుండి వైరస్ వ్యాపించిందని చెప్పారు. తాజాగా.. చైనాలో పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త కోవిడ్ వ్యాప్తికి సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టాడు. అమెరికా శాస్త్రవేత్త ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ కరోనా మానవ నిర్మిత వైరస్ అని పేర్కొన్నారు. ఇప్పుడీ విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

- Advertisement -

‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’ పేరుతో పుస్తకాన్ని విడుదల చేసిన ఆండ్రూ హఫ్.. కోవిడ్ ల్యాబ్ లీక్ థియరీ గురించి వెల్లడించినట్టు న్యూయార్క్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వ నిర్వహణ, నిధులతో పనిచేస్తున్న పరిశోధనా సంస్థ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV) నుంచి కోవిడ్ లీక్ అయిందని తెలిపారు. బ్రిటిష్ వార్తాపత్రిక ది సన్‌లో పరిశోధకుడు ఆండ్రూ హఫ్ ప్రకటనను ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ దీనిని నివేదించింది. “ది ట్రూత్ అబౌట్ వుహాన్” పుస్తకంలో ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్‌ పలు విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. యూఎస్ ప్రభుత్వం వైరస్‌కు నిధులు సమకూర్చడం వల్లే చైనాలో కరోనావైరస్‌ మహమ్మారి సంభవించిందని బాంబ్ పేల్చారు. కాగా.. వుహాన్ ల్యాబ్ లో వైరస్ ప్రయోగ నిర్వహణ, భద్రతా లోపంతో నిర్వహించినట్లు తెలిపారు. వుహాన్ ల్యాబ్‌ నుండే వైరస్ లీక్ అయిందని ఆండ్రూ పేర్కొన్నారు.

ఆ విషయం చైనాకు ముందే తెలుసని.. ఈ బయోటెక్నాలజీని చైనీయులకు బదిలీ చేయడానికి US ప్రభుత్వమే కారణమని.. ఇది చూసి తాను కూడా భయపడినట్లు ఆండ్రూ హాఫ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News