Sunday, October 6, 2024
Homeనేషనల్Covid alert: 20 రోజుల్లో తారాస్థాయికి కోవిడ్, XBB.1.16 వేరియంట్ తో పారాహుషార్

Covid alert: 20 రోజుల్లో తారాస్థాయికి కోవిడ్, XBB.1.16 వేరియంట్ తో పారాహుషార్

గతేడాది సెప్టెంబర్ తరువాత ఈరోజు అత్యధిక కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 20 రోజుల్లో కోవిడ్ కేసులు తారాస్థాయికి చేరుతాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కానీ అది ఫోర్త్ వేవ్ మాత్రం కాదని వెల్లడించటం విశేషం. 15-20 రోజుల తరువాత మళ్లీ కోవిడ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుందని వీరు అంచనా వేస్తున్నారు.  రంజాన్ తోపాటు పలు పబ్లిక్ హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ఈ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని, గతంలో జరిగినదాన్ని బేరీజు వేసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టు కోవిడ్ నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

XBB.1.16 వేరియంట్ తో జాగ్రత్తగా ఉండాలని, మరో 6 వేరియంట్లు కూడా విజృంభిస్తున్నాయని కేంద్రం ఈరోజు హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ దేశంలో కరోనా పరిస్థితిని ఈరోజు సమీక్షించారు. వచ్చేవారం మాక్ డ్రిల్ కు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.  కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, హర్యానా రాష్ట్రాలకు హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News