దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో బూస్టర్ షాట్స్ కు మాంచి డిమాండ్ వచ్చిపడింది. ఇక బ్లాక్ లో బూస్టర్ డోసుల దందా ఓ రేంజ్ లో దేశవ్యాప్తంగా సాగుతోంది. కరోనా సన్నద్ధతను చెక్ చేసేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించిన మాక్ డ్రిల్ పూర్తయి 24 గంటలు కాకముందే దేశరాజధానిలో ఓ సమస్య ఢిల్లైట్స్ ను కలవర పెడుతోంది. న్యూ ఢిల్లీలోని అన్ని గవర్నమెంట్ సెంటర్స్ లోనూ కోవిడ్ బూస్టర్ డోసులు నిండుకున్నట్టు కోవిన్ యాప్ లో చూపిస్తోంది. దీంతో ఉచిత టీకా ఇప్పట్లో ఢిల్లీలో దొరికే అవకాశాలు కనిపించక ప్రజలు ప్రైవేటు సెంటర్స్ లో డబ్బులు పెట్టి టీకాలను కొనాల్సి వస్తోంది. ప్రికాషన్ డోస్ గా బూస్టర్ డోస్ ను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతుండటం, విదేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కోవిడ్ టీకాలకు మళ్లీ డిమాండ్ ఊపందుకుంది.
Covid Booster dose: ఢిల్లీలో నిండుకున్న బూస్టర్ డోసులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES