Saturday, May 24, 2025
Homeనేషనల్దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఆ రాష్ట్రాల్లో వైరస్ ఉధృతి..!

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఆ రాష్ట్రాల్లో వైరస్ ఉధృతి..!

దేశంలో కరోనా మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది.. ఆందోళన కలిగించే సంఖ్యలో కోవిడ్ కేసులు పలు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు అధికారిక నివేదికలు వెల్లడించాయి. JN 1 వేరియంట్ కారణంగానే ఈ కేసుల పెరుగుదలకి కారణమని ఆరోగ్య శాఖ నిపుణులు పేర్కొన్నారు.

- Advertisement -

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెద్దగా పెరగలేదు.. అయితే ఇటీవలే ఒక్క కేరళలోనే 273 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 23 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా కేసుల పెరుగుదలపై కేంద్రానికి సమాచారం అందించాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. అవసరమైతే ఐసోలేషన్ వార్డులు సిద్ధంగా ఉంచాలని, ఆక్సిజన్, మందులు తగిన మోతాదులో నిల్వ ఉంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

ఈ కేసుల పెరుగుదల వెనుక కొత్తగా గుర్తించిన జేఎన్.1 వేరియంట్ ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇది తీవ్రత తక్కువగా ఉన్న వైరస్ కావడంతో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ప్రాణనష్టం నమోదుకాలేదని అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ వల్ల సోకినవారిలో ప్రధానంగా జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఎక్కువమంది 3–4 రోజుల్లోనే కోలుకుంటున్నారు.. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ వేరియంట్‌ను ఆందోళన కలిగించే వేరియంట్’గా గుర్తించలేదు. ప్రజల్లో గాబరా అవసరం లేదు. కానీ అవసరమైన జాగ్రత్తలు పాటించాలి,” అని ఢిల్లీ ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ అన్నారు. మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం, గుంపుల నుండి దూరంగా ఉండడం వంటి ప్రాథమిక నియమాలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News