Sunday, November 16, 2025
Homeనేషనల్Coronavirus Active Cases: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వెయ్యికి చేరిన యాక్టివ్ కేసులు..!

Coronavirus Active Cases: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వెయ్యికి చేరిన యాక్టివ్ కేసులు..!

దేశంలో కోవిడ్ మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ నుంచీ దక్షిణ భారత రాష్ట్రాల దాకా ఈ వైరస్ తిరిగి విస్తరిస్తోంది. తాజాగా యాక్టివ్ కేసుల సంఖ్య వేయికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు కోవిడ్‌ను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్ష చేయించుకోవడం అవసరం. సకాలంలో పరీక్ష చేయించుకుంటే వైరస్‌ను తొందరగా గుర్తించవచ్చ. దీంతో ఇతరులకు వ్యాపించకుండా కూడా నియంత్రించవచ్చు.

- Advertisement -

ప్రభుత్వం అందిస్తున్న వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఉచితంగా కోవిడ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మీ ప్రాంతానికి సమీపంలోని పరీక్ష కేంద్రాల వివరాలను CoWIN పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే, ఎవరికైనా కోవిడ్ అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే నేషనల్ హెల్ప్‌లైన్ 1075 నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఇది 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్.

ఇక ప్రైవేట్ ల్యాబ్‌ల్లోనూ పరీక్షల సౌకర్యం ఉంది. కొన్నీ ల్యాబ్‌లు ఇంటికే వచ్చి నమూనాలు సేకరించే సేవను కూడా అందిస్తున్నాయి. వీరి సేవలను వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రైవేట్ ల్యాబ్‌లలో RT-PCR పరీక్ష ఖర్చు సుమారుగా ₹500 నుంచి ₹1000 వరకు ఉంటోంది. మీ శరీరంలో ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే, కోవిడ్ పరీక్ష తప్పనిసరి. ముందు జాగ్రత్తలు తీసుకుని, మీకే కాకుండా మీ చుట్టూ ఉన్న వారిని కూడా రక్షించండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad