మనదేశంలో కరోనా కేసుల సంఖ్య 11 శాతం పెరగటం కలవరపెడుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హిమాచల్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. పండుగలు, లాంగ్ వీకెండ్స్, న్యూ ఇయర్ సందర్భంగా ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఆసుపత్రుల్లోని వైద్య సదుపాయాలు, ఐసోలేషన్ బెడ్స్, ఐసీయూ, ఆక్సిజన్, వెంటిలేటర్ లభ్యత వంటివాటిపై ఈ మాక్ డ్రిల్ దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో సాగుతోంది.
ఓవైపు కొత్త వేరియంట్ల కలకలంతోపాటు కోల్ కతా, బిహార్, గుజరాత్ వంటి చోట్ల కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో బూస్టర్ డోస్ కు మనదేశంలో బాగా డిమాండ్ పెరిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఈరోజు కోవిడ్ మాక్ డ్రిల్ విజయవంతంగా సాగుతోంది. మాస్కులు ధరించాలని ఇప్పటికే గైడ్ లైన్స్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు జారీచేసింది. చైనాలో కోట్ల మందికి కోవిడ్ సోకి, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి.