Digital Arrest: కేరళలోని కొల్లం జిల్లా పదనాయకులంగర ప్రాంతానికి చెందిన 79 ఏళ్ల వృద్ధుడిని టార్గెట్ చేశారు సైబర్ మోసగాళ్లు. అతడిని ‘వర్చువల్ అరెస్ట్’ చేసినట్లు నమ్మించిన సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ. 3.72 కోట్లు వసూలు చేశారు. వాట్సాప్ ద్వారా చేసిన వీడియో కాల్‌లో తనను BSNL అధికారిగా చెప్పుకున్న ఓ వ్యక్తి.. వృద్ధుడు చెయ్యని నేరాలకు సంబంధించి అతని మొబైల్ నంబర్ ముంబై సైబర్ పోలీసుల దర్యాప్తులో ఉందని భయపెట్టాడు.
తర్వాత పోలీసు యూనిఫారంలో కనిపించే వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేసి తన పేరు మీద ఆధార్ ద్వారా ఓ బ్యాంకు అకౌంట్ తెరిచారని.. దాన్ని నేరపూరిత కార్యక్రమాలకు వాడుతున్నారని హెచ్చరించాడు. ఈ క్రమంలో వృద్ధుడిని తాము నిజమైన అధికారులుగా నమ్మించేందుకు ఫేక్ అరెస్ట్ వారెంట్ చూపించి, ‘వర్చువల్ అరెస్ట్’లో ఉన్నట్టు చెప్పారు. అనంతరం వర్చువల్ కోర్టులో వీడియో కాల్ ద్వారా హాజరయ్యేలా చేసి, తన అకౌంట్స్‌ను వెరిఫికేషన్ కోసం ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలని బలవంతం చేశారు.
Andhra Pradesh Liquor Scam: మద్యం కుంభకోణంలో ట్విస్ట్.. లైట్ తీసుకున్న జగన్
వృద్ధుడు తనతో పాటు భార్య అకౌంట్స్ నుంచి జూలై 23 నుంచి ఆగస్టు 29 వరకు 17 ట్రాన్సాక్షన్లలో మొత్తంగా రూ.3.72 కోట్లు నేరగాళ్లు సూచించిన అకౌంట్లకు పంపాడు. వెరిఫికేషన్ తర్వాత కూడా డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయిన విషయం గ్రహించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అకౌంట్లు ట్రేస్ చేసి డబ్బును ఫ్రీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.
డిజిటల్ మోసాలతో ఇలా అప్రమత్తతంగా ఉండండి..
* ఎవ్వరైనా పోలీస్, బ్యాంక్, ప్రభుత్వం తరఫు వాళ్లని పరిచయం చేసుకున్నా, వాట్సాప్ లేదా వీడియో కాల్‌లో వ్యక్తిగత/బ్యాంక్ వివరాలు అడిగితే అప్రమత్తంగా ఉండాలి.
* అరెస్ట్ లేదా అనుమానాల పేరిట డబ్బు అడగడం ప్రభుత్వ అధికారుల నుంచి అస్సలు జరగదని గుర్తుంచుకోండి.
* ఆందోళన కలిగించేట్టు బెదిరింపులు వస్తే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి.
* డబ్బు తిరిగి వస్తుందని బలవంతంగా పని చేయించడమంటే అవి అవుట్‌రైట్ మోసాలేనని గుర్తించండి.
* ఇలాంటి డిజిటల్ మోసాల తీరుపై సామాన్యులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సందేహాస్పదమైన కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు తెలపడం ఉత్తమం.


