Date fixed for the release of PM Kisan funds: రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధుల విడుదల విషయంలో క్లారిటీ వచ్చింది. ఈనెల 20న దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. 23వ విడత కింద ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేల చొప్పున నగదు జమ చేయనున్నారు. పీఎం-కిసాన్ పథకాన్ని 2019లో మోదీ సర్కారు ప్రారంభించగా.. ఏటా మూడు దఫాలుగా రూ. 2 వేలు చొప్పున అనగా మొత్తంగా రూ. 6 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది.
Also Read: Donald Trump: అదేం ఫైనల్ కాదు.. నచ్చకపోతే మళ్లీ దాడులు చేస్తాం.. బాంబు పేల్చిన ట్రంప్
మీ పేరు ఉందా? లేదా? ఇలా చెక్ చేసుకోండి..
కాగా, పీఎం కిసాన్ నిధుల విడుదల విషయంలో కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. కేవలం అర్హులకు మాత్రమే ఈ నిధులు అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తోంది. అందుకే, పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పీఎం కిసాన్‌లో మీ పేరును చెక్ చేసుకునేందుకు.. ముందుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ‘ఫార్మర్ కార్నర్’ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో లబ్దిదారుల లిస్ట్‌పై క్లిక్ చేస్తే రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం ఎంచుకోవాలి. అక్కడ సదరు గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈ-కేవైసీ చేయని వారికి నిధులు జమ చేయమని కేంద్రం స్పష్టం చేసిన క్రమంలో.. ఒకవేళ, మీరు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే.. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయండి. ఇందుకోసం, ఈ-కేవైసీ ఆప్షన్ ఎంచకుని ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు.

