Delhi airport ATC flight delays server glitch technical problem: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక సమస్యల తలెత్తింది. తద్వారా 100 పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యతో నిన్న (నవంబర్ 6) సాయంత్రం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల ఇవాళ (నవంబర్ 7) ఉదయం నాటికి 100కి పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. విమానాలు రన్‌వేలపై నిలిచి ఉన్నాయి. వీటి ప్రారంభానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏటీసీ వ్యవస్థలోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS) లో సాఫ్ట్‌వేర్ లోపం తలెత్తినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ఇది ఆటో ట్రాక్ సిస్టమ్ ను ప్రభావితం చేసి, విమానాల షెడ్యూల్స్ ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంతోనే ఢిల్లీ నుండి బయలుదేరే విమానాలు సగటున 50 నిమిషాలు ఆలస్యం అవుతున్నాయి. దీనివల్ల రావాల్సిన విమానాలు కూడా ప్రభావితమవుతున్నాయి.
ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ..
ఢిల్లీ విమానాశ్రయంలో విమాన ప్రయాణాలకు ఆలస్యం కావడంతో ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో విమానయాన సంస్థలు ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ఏటీసీ సమస్య వల్ల అన్ని ఎయిర్‌లైన్స్ విమానాలు ఆలస్యమవుతున్నాయని ఎయిర్‌పోర్ట్, విమానంలో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందని ఎయిర్ ఇండియా తమ ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ఏటీసీ సాంకేతిక సమస్యల వల్ల ఢిల్లీ బయలుదేరాల్సిన రావాల్సిన విమానాలు ప్రభావితమవుతున్నాయని ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ ఫ్లైట్ షెడ్యూల్‌ను చెక్ చేసుకోవాలని స్పైస్ జెట్ సూచించింది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విమాన రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని ఇండిగో పేర్కొంది.
A technical issue with the ATC system in Delhi is impacting flight operations across all airlines, leading to delays and longer wait times at the airport and onboard aircraft. We regret the inconvenience caused by this unforeseen disruption, which is beyond our…
— Air India (@airindia) November 7, 2025
ఉత్తరాది రాష్ట్రాలపై ప్రభావం..
ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమస్యను పరిష్కరించడానికి టెక్నికల్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. రాత్రి కల్లా సమస్య తొలిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు తమ ఎయిర్‌లైన్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో విమాన స్థితిని చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని అధికారులు భరోసా ఇచ్చారు. కాగా, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ), దేశంలోనే అత్యంత బిజీ ఎయిర్‌పోర్టులలో ఒకటి. దేశ రాజధాని ఢిల్లీలో గల ఈ ఎయిర్‌పోర్టు ప్రపంచ ర్యాంకింగ్‌లో 9వ స్థానంలో ఉంది. ఢిల్లీ విమానాశ్రయం రోజుకు 1500 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక రోజుకు సగటున 2.2 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.. ఏడాదికి సుమారు 8 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు.. ఏటీసీ సాంకేతిక సమస్యల ఢిల్లీతో పాటు ఉత్తరా రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులపై కూడా పడింది. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు.


