ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ అయ్యాయి. ఈమేరకు సెంట్రల్ బ్యూరో
ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీచేసింది. దీనిపై విచారణకు ఆదివారం రావాల్సిందిగా ఆయనకు నోటీసులు అందాయి. ఈ కుంభకోణంలో అత్యున్నత స్థాయిలో అధికార దుర్వినియోగం, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం కుంభకోణంలో లభించిన అవినీతి సొమ్ముతోనే గోవా ఎన్నికల్లో ఆప్ పోటీ చేసిందనే ఆరోపణలు రాగా అవన్నీ కక్షపూరితంగా తమపై బురద చల్లటంలో భాగమని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. మద్యం కుంభకోణంలో వందల కోట్ల రూపాయలు చేతులు మరాయని, హవాలా ఆపరేషన్స్ పెద్ద ఎత్తున నడిచాయని సీబీఐ పేర్కొంది. ఇప్పటికే కేజ్రీవాల్ మంత్రివర్గంలో కీలకమైన నేత, మాజీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియాను ఫిబ్రవరిలోనే అరెస్టు చేశారు.