దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 6 గంటల లోపు క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసేందుకు అనుమతించారు. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం(Election Commission) ప్రకటించింది. అత్యధికంగా నార్త్-ఈస్ట్ దిల్లీ నియోజకవర్గంలో 52.73శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా న్యూఢిల్లీలో 43.1శాతం పోలింగ్ నమోదైంది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(ఈస్ట్), ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. కాగా ఫిబ్రవరి 8న పోలింగ్ ఫలితాలు వెల్లడికానున్నాయి.