Saturday, November 15, 2025
HomeTop StoriesDelhi bomb blast: ఢిల్లీలో భారీ పేలుడు.. భయానక విజువల్స్.. ముక్కలు ముక్కలైన మృతదేహాలు

Delhi bomb blast: ఢిల్లీలో భారీ పేలుడు.. భయానక విజువల్స్.. ముక్కలు ముక్కలైన మృతదేహాలు

Delhi Bomb Blast Dead Bodies Visuals: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడుకి సంబంధించి భయానక విజువల్స్‌ వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోగా.. 24 మందికి పైగా గాయాలయ్యాయి. మృతదేహాలు ముక్కలుముక్కలుగా పడి ఉండటం కలచివేస్తుంది. పలు కార్లు మంటల్లో ధ్వంసమయ్యాయి. పేలుడు ఘటన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్‌ ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

- Advertisement -

బాంబ్‌ బ్లాస్ట్‌ వెనుక ఉగ్ర కుట్ర ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. కాగా, సోమవారం జమ్మూకశ్మీర్‌ పోలీసులు.. జైషే మహమ్మద్ , అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్‌ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఓ మాడ్యూల్‌ను ఛేదించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

సోమవారం ఉదయం శ్రీనగర్, అనంతనాగ్‌, గండేర్బాల్, షోపియన్, ఫరీదాబాద్‌, సహరాన్‌పూర్‌ ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఎర్రకోట సమీపంలో కారులో బాంబు పేలుడు సంభవించడంతో ఈ దాడికి ఉగ్రవాదులతో సంబంధం ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.

Also Read: https://teluguprabha.net/national-news/bomb-blast-in-car-at-red-fort-delhi-one-died/

ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, హరియాణా, యూపీలను కలిపే సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసు నిఘాను పెంచారు. రైల్వే, మెట్రో స్టేషన్‌ వంటి రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో తనిఖీలు చేస్తున్నారు. స్పెషల్‌ సెల్‌, క్రైం బ్రాంచ్‌ సహా అన్ని విభాగాలను అప్రమత్తం చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad