Ex Gratia to Delhi Bomb Blast Victims: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయాలపాలయ్యారు. బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదం కారణంగా శాశ్వతంగా దివ్యాంగులుగా మారిన వారికి రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయాలపాలైన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/jubilee-hills-by-election-2025-voting-day-live-updates/
సోమవారం సాయంత్రం 6.52 గం.ల సమయంలో ఎర్రకోట సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హ్యుందాయ్ i20 కారులో బాంబు పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియోలు సైతం బయటకు వచ్చాయి. అయితే ఆ కారు నడుపుతున్న వ్యక్తిని డా.ఉమర్ నబీ అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు గత రెండ్రోజుల నుంచి ఉగ్రకుట్రల్లో భాగమవుతున్న వాళ్లని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. వాళ్లలో ఐదురుగు వైద్యులే ఉండటం సంచలనం సృష్టిస్తోంది.
పేలుడు ఘటన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర హోం శాఖ ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. దీంతో మరికొన్ని రోజుల్లోనే ఈ బాంబు దాడికి సంబంధించి వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. దాడికి పాల్పడ్డ నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. త్వరలోనే అన్ని వివరాలు బయటకు వస్తాయని వెల్లడించారు.
ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ అమిత్ షా తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో భద్రతపై ఇప్పటికై అమిత్ షా ఉన్నతాధికారులతో రెండు సార్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఘటన వెనుక ఉన్న ప్రతి నిందితుడిని వేటాడాలని అధికారులను ఆదేశించినట్లు అమిత్ షా తెలిపారు. నిందితులపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయని వెల్లడించారు. అత్యున్నత సంస్థలు రంగంలోకి దిగాయని.. సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తాయని అమిత్ షా వివరించారు.


