Delhi CM Rekha Gupta Controversial Comments on EVM: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. “గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను హ్యాక్ చేస్తూనే ఉంది కదా.. అప్పుడు ఎవరికీ తప్పుగా అనిపించలేదు. ఇప్పుడు మేము చేస్తే మాత్రం తప్పుగా కనిపిస్తోంది” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు .. రాజకీయ వర్గాల్లో పెను దుమారానికి కారణమయ్యేలా కనిపిస్తోంది.
ఇదేెం ద్వంద్వ నీతి: దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇటీవల ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని రాహుల్ గాంధీ బీజేపీని ఆరోపిస్తున్న ఆంశంపై విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రేఖా గుప్తా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అది ప్రజా తీర్పు అని.. అదే తాము గెలిస్తే మాత్రం ఈవీఎం హ్యాకింగ్‌గా అని మండిపడ్డారు. ఈ ద్వంద్వ నీతి ఏ పుస్తకంలో ఉందో రాహుల్ గాంధీయే చెప్పాలని అన్నారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప ఆయనకు ఇంకేమైనా తెలుసా అని తీవ్రస్థాయిలో రేఖా గుప్తా ప్రశ్నించారు.
సామాజికి మాధ్యమాల్లో వైరల్: దిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. 13 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. “ఢిల్లీ సీఎం ఏం చెబుతున్నారో చూడండి” అనే వ్యాఖ్యను జోడించడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయం బయటపెట్టిన ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్లు: అరవింద్ కేజ్రీవాల్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోపై పలు ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్లు స్పందించాయి. కేజ్రీవాల్ పోస్ట్ చేసింది కేవలం కత్తిరించిన వీడియో అని.. పూర్తి ఇంటర్వ్యూ చూడాలంటూ అసలు వీడియోను బయటపెట్టాయి. అయితే ఆ పూర్తి వీడియోలో కూడా రేఖా గుప్తా అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ఈవీఎంల విశ్వసనీయతపై జరుగుతున్న చర్చకు.. ఆమె వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్లయింది.


