Saturday, June 29, 2024
Homeనేషనల్Delhi: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడపండి: పురందేశ్వరి

Delhi: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడపండి: పురందేశ్వరి

సానుకూలంగా స్పందించిన మంత్రి కుమారస్వామి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకుని వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రమంత్రి కుమారస్వామిని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందంతో ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక యాక్షన్ ప్లాన్ ను తయారు చేసి కేబినెట్ మంత్రి కుమార స్వామితో ఆమె సమావేశమై వినతిపత్రం సమర్పించారు. గతంలో ఇచ్చిన వినతుల ఆధారంగా కుమార స్వామి అధికార యంత్రాంగంతో చర్చలు జరిపిన విషయాన్ని కుమార స్వామి ఎంపీ పురందేశ్వరి, ప్రతినిధి బృందానికి వివరించారు.

- Advertisement -

” విశాఖ ఉక్కు (వైజాగ్ స్టీల్ ప్లాంట్)- ఆంధ్రుల హక్కు” అనే ఉద్యమంలో నుండి వచ్చిన ఒక భారీ పరిశ్రమ అని కుమార స్వామికి తెలిపారు. ఆంధ్రుల సెంటిమెంట్ ను గౌరవిస్తూ నిర్ణయం ఉండాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ స్టీల్ ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహిస్తూ లాభాల బాటలోకి తీసుకుని వచ్చే కోణంలో మాత్రమే విధానాలు ఉండాలన్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావిస్తూ సుదీర్ఘ చర్చలు జరిపారు. స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకొని వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా పురందేశ్వరి కేంద్ర మంత్రిని కోరారు.

ఎంపీ పురందేశ్వరి జరిపిన చర్చలతో కేంద్రమంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. అధికారులతో కూలంకుషంగా చర్చలు జరిపిన తరువాత ఇదే విషయం పై రెండు నెలల్లో మరో మారు సమావేశం నిర్వహించుకుందామని ఎంపీ పురందేశ్వరికి హామీ ఇచ్చారు.

కేంద్రమంత్రి కుమార స్వామిని కలిసిన వారిలో ఎంపీ పురందేశ్వరితో పాటు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, అనకాపల్లి ఎంపి సిఎం రమేష్, ఏపీకి చెందిన సాగి కాశీ విశ్వనాధరాజులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News