జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందే, అదానీ కుంభకోణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిందేనంటూ నిరసిస్తూ ప్రతిపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఈమేరకు జేపీసీ కోసం వినతి పత్రాన్ని సమర్పించేందుకు అపాయింట్ మెంట్ కూడా కోరాయి ప్రతిపక్ష పార్టీలు. కాంగ్రెస్ నేతృత్వంలో విజయ్ చౌక్ వరకూ సాగిన ఈ పాదయాత్రలో డెమాక్రసీ ఇన్ డేంజర్ అంటూ ప్రతిపక్షాలు నినదించాయి. అదానీ కుంభకోణాలపై ప్రతిపక్షాల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసే అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చిందని విపక్షాలు భగ్గుమన్నాయి.
కాగా కాంగ్రెస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈమేరకు ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. 12 విపక్ష పార్టీలు ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గేతో భేటీ ముగించాక ఈ పాదయాత్రను చేపట్టాయి.