ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election)కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈనెల 18న నామినేషన్ల పరిశీలన, 20 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
ఢిల్లీలో 1.55 కోట్ల ఓటర్లు ఉండగా.. 83.49 లక్షల పురుష ఓటర్లు, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటికే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 70మంది అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను వెల్లడించనున్నాయి.