Wednesday, January 14, 2026
Homeనేషనల్Delhi : ఢిల్లీ సర్కారీ విందు.. మెనూలో మటన్ రోగన్ జోష్, గులాబ్ జామూన్!

Delhi : ఢిల్లీ సర్కారీ విందు.. మెనూలో మటన్ రోగన్ జోష్, గులాబ్ జామూన్!

Delhi government official event menu : ఇకపై ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఘుమఘుమలాడే విందు భోజనం ఖాయం. లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి సచివాలయం వరకు, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఓ భారీ, విభిన్నమైన మెనూను ఢిల్లీ ప్రభుత్వం ఖరారు చేసింది. చికెన్ తందూరీ, మటన్ రోగన్ జోష్ నుంచి పనీర్ టిక్కా, దాల్ మఖనీ వరకు.. నోరూరించే వంటకాలతో ఈ జాబితా ఆకట్టుకుంటోంది. అసలు ఈ కొత్త మెనూను ఎందుకు రూపొందించారు? ఇందులో ఇంకా ఏయే ప్రత్యేక వంటకాలు ఉన్నాయి? వాటి ధరలెలా ఉన్నాయి?

- Advertisement -

ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు, సమావేశాలకు క్యాటరింగ్ సేవలు అందించేందుకు, ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (DTTDC) ఓ కొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. అనుభవజ్ఞులైన అవుట్‌డోర్ క్యాటరర్లను ఎంపానెల్ (జాబితాలో చేర్చడం) చేయడానికి టెండర్లను ఆహ్వానించింది. జనవరి 23తో ఈ బిడ్ల గడువు ముగియనుంది. ఈ టెండర్‌లో భాగంగానే, శాకాహార, మాంసాహార వంటకాలతో కూడిన ఓ విస్తృతమైన మెనూను, వాటి ధరలను కూడా DTTDC ఖరారు చేసింది. ఎంపికైన క్యాటరర్లు, ఈ మెనూ ప్రకారం, ప్రభుత్వ శాఖలు కోరిన వంటకాలను సరఫరా చేయాల్సి ఉంటుంది.

మెనూలో ఏముంది :  : ఈ అధికారిక మెనూ, స్టార్ హోటళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది.
శాకాహార థాలీ: రూ. 290
మాంసాహార థాలీ: రూ. 325
సూప్‌లు: టొమాటో షోర్బా, స్వీట్ కార్న్ సూప్ నుంచి చికెన్ క్లియర్ సూప్, మర్గ్ షోర్బా వరకు అనేక రకాలు.
స్నాక్స్: పనీర్ టిక్కా, సమోసా, స్ప్రింగ్ రోల్స్ వంటి శాకాహార స్నాక్స్‌తో పాటు, మటన్ సీఖ్ కబాబ్, తందూరీ చికెన్, చిల్లీ చికెన్ వంటి మాంసాహార స్నాక్స్.

ప్రధాన వంటకాలు: షాహీ పనీర్, మలై కోఫ్తా, దమ్ ఆలూ వంటి శాకాహార వంటకాలతో పాటు, మటన్ రోగన్ జోష్, బటర్ చికెన్ మసాలా, గోవాన్ ఫిష్ కర్రీ వంటి ప్రసిద్ధ మాంసాహార వంటకాలు.
ఇతరాలు: దాల్ మఖనీ, రాజ్మా మసాలా వంటి పప్పులు, నాన్, రోటీ, కుల్చా వంటి రొట్టెలు, జీరా రైస్, వెజ్ పులావ్ వంటి రైస్ ఐటమ్స్.
స్వీట్లు: గులాబ్ జామూన్, జిలేబీ, రసమలై, గజర్ హల్వాతో పాటు, చాక్లెట్ ట్రఫుల్ కేక్ వరకు అనేక రకాల డెజర్ట్‌లు.

రూ.2 కోట్ల కాంట్రాక్టు : ఈ క్యాటరింగ్ సేవల కోసం, రెండేళ్ల కాలానికి గాను సుమారు రూ.2 కోట్ల విలువైన కాంట్రాక్టును ఇవ్వనున్నట్లు DTTDC అంచనా వేసింది. ఈ ఒప్పందం 2027 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది, అవసరమైతే మరో ఏడాది పొడిగించే అవకాశం కూడా ఉంది. క్యాటరర్లు, తమ సిబ్బందితో పాటు, అవసరమైన అన్ని సామాగ్రిని వారే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News