Delhi: ఢిల్లీలో వ్యక్తిని కారుతో ఢీకొట్టిన ఘటనలో పదహారేళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని సమయ్‌పూర్ బద్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టి దాదాపు 600 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి బాధితుడి మరణానికి దారితీసిన కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సమయ్‌పూర్ బద్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడని సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న తర్వాత.. బాధితుడి శరీరం అంతటా గాయాలు, చిరిగిన బట్టలుతో కనిపించాడు. పోలీసు అధికారులు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితుడిని బురారి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మరణించినట్లు ప్రకటించారు.
Read Also: Viral: సంచలనం సృష్టించిన చైనా యువతి భరతనాట్యం
ఇకపోతే, మృతుడిని బద్లి పారిశ్రామిక ప్రాంతంలోని రాజా విహార్ నివాసి సుజీత్ మండల్ (32) గా పోలీసులు గుర్తించారు. మృతుడు బద్లి పారిశ్రామిక ప్రాంతంలోని పివిసి పైపుల కర్మాగారంలో పనిచేస్తున్నాడని అతని బావమరిది జితేష్ తెలిపారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో మండల్‌ను ఒక ఎరుపు రంగు కారు ఢీకొట్టింది. బ్యానెట్ కింద చిక్కుకున్న సుజీట్ ని సుమారు 600 మీటర్లు ఈడ్చుకెళ్లి.. బద్లి పారిశ్రామిక ప్రాంతంలోని గేట్ నంబర్ 5, ఎన్డిపిఎల్ కార్యాలయం సమీపంలో పడవేసినట్లు స్థానిక విచారణలో వెల్లడైందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) హరేశ్వర్ తెలిపారు.
VIDEO | Delhi: A man died after a car driven by a minor hit and dragged him for some distance in northwest Delhi's Samaypur Badli area. CCTV visuals of the incident, which took place on Saturday (August 23).#DelhiNews
(Visuals discretion advised)
(Source: Third Party) pic.twitter.com/dyWHH4A5p6
— Press Trust of India (@PTI_News) August 27, 2025
Read Also: Asia Cup: గేమ్ ఛేంజర్లు వారే.. ముగ్గురు క్రికెటర్లపై సెహ్వాగ్ ప్రశంసలు


