Delhi Metro: ఢిల్లీ ప్రజలకు మెట్రో షాక్ ఇచ్చింది. మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారిగా అధికారికంగా టికెట్ ఛార్జీలను పెంచింది. సోమవారం నుంచి సవరించిన ధరలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో, దేశ రాజధానిలోని ప్రయాణికులు ఇప్పుడు తమ మెట్రో ప్రయాణాలకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారిగా మెట్రో ఛార్జీల పెంపు ఇది. నాల్గవ ఛార్జీల స్థిరీకరణ కమిటీ సిఫార్సుల ఆధారంగా 2017లో చివరి సవరణ జరిగింది.
Read Also: BCCI: డ్రీమ్ 11తో బీసీసీఐ కటీఫ్.. రూ. 358 కోట్ల ఒప్పందం రద్దు
నామమాత్రంగా ఛార్జీల సర్దుబాటు
ఛార్జీల సర్దుబాటు నామమాత్రమని, చాలా లైన్లలో రూ.1 నుంచి రూ.4 మధ్య పెరుగుదల ఉందని DMRC పేర్కొంది. అయితే, ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో మాత్రం ఛార్జీలు రూ.5 వరకు పెరుగాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ లో ధ్రువీకరించింది. “ఢిల్లీ మెట్రో సేవల ప్రయాణీకుల ఛార్జీలు 25 ఆగస్టు 2025 (సోమవారం) నుండి సవరించాం. ఛార్జీల పెరుగుదల అత్యల్పంగా ఉంది. ప్రయాణ దూరాన్ని బట్టి రూ.1 నుండి రూ.4 వరకు ఉంటుంది. విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ లైన్‌కు రూ.5 వరకు పెరుగుతోంది” అని వెల్లడించింది.
Read Also: Dog Bite: కుక్క కరిచిన వెంటనే ఏంచేయాలి..?
కనీష్ఠ ధర రూ.11
కొత్త ఛార్జీల నిర్మాణం అన్ని దూర స్లాబ్‌లలో మార్పులను ప్రతిబింబిస్తుంది. 0 నుండి 2 కిలోమీటర్ల మధ్య తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణీకులు ఇప్పుడు రూ.11 చెల్లిస్తారు. అయితే, ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు (32 కిలోమీటర్లకు మించి) రూ.64 చెల్లిస్తారు. గతంలో గరిష్ఠ ఛార్జీ రూ.60 ఉండగా కనీస ఛార్జీ రూ.10గా ఉంది. ఇది 390 కిలోమీటర్లకు పైగా ఢిల్లీ మెట్రో విస్తరించింది. దేశ రాజధాని ప్రాంతంలోని 285 కంటే ఎక్కువ స్టేషన్లలో సేవలు అందిస్తుంది. ప్రయాణికులకు, ముఖ్యంగా సాధారణ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నంలో భాగంగా ఆదివారాలు, జాతీయ సెలవు దినాలకు రాయితీ ఛార్జీ స్లాబ్ లు ప్రవేశపెట్టింది. ఛార్జీల పెంపు ప్రకటన తర్వాత ఈ నిర్ణయంపై అనేక మంది ప్రయాణికులు, సోషల్ మీడియా యూజర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వ్యతిరేకతలు ఉన్నప్పటికీ, సేవా ప్రమాణాలను నిర్వహించడానికి, భవిష్యత్తులో మౌలిక సదుపాయాల నవీకరణలకు మద్దతు ఇవ్వడానికి ఛార్జీల సవరణ అవసరమని DMRC అధికారులు అభిప్రాయపడుతున్నారు.


