Sunday, February 23, 2025
Homeనేషనల్Delhi new CM: ఢిల్లీకి కొత్త సీఎం, క్లారిటీ ఇంకొన్ని గంటల్లో

Delhi new CM: ఢిల్లీకి కొత్త సీఎం, క్లారిటీ ఇంకొన్ని గంటల్లో

ఇద్దరు డిప్యుటీ సీఎంలు

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది. సోమవారం జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. 27 ఏళ్ల తరువాత హస్తినలో సర్కారు ఏర్పాటు చేయబోతున్న కమలనాథులు సీఎంగా ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా చేసేందుకు సన్నాహాలు సాగుతుండగా 15 మంది మంత్రులు సీఎంతో పాటు బాధ్యతలు చేపట్టనున్నారు.

- Advertisement -

కాగా ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్న పేర్లన్నీ అత్యంత బలమైన వ్యక్తులవే కావటం విశేషం. మరోవైపు సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా సీఎంతో పాటు ఇద్దరు డిప్యుటీ సీఎంలను బీజేపీ నియమిస్తుందని తెలుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 స్థానాలు గెలిచి 10 ఏళ్ల ఆప్ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టింది.

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన జెయింట్ కిల్లర్, ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మా ఈ రేస్ లో అందరికంటే ముందున్నట్టు ఊహాగానాలు సాగుతున్నాయి. ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రెటరీ అశిష్ సూద్, మాజీ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా, ఢిల్లీ బీజేపీ మాజీ అధక్షుడు సతీష్ ఉపాధ్యాయ, ఆర్ఎస్ఎస్ బలమైన నేతగా ఉన్న జితేందర్ మహాజన్ ఢిల్లీ సీఎం రేసులో ఉన్నట్టు సమాచారం. మహిళా నేతలు రేఖా గుప్తా, శిఖా రాయ్ కూడా ఈ రేస్ లో ఉన్నారు.

మోడీ అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే ఢిల్లీ సీఎంపై అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News