Delhi Air Pollution China reaction : ఢిల్లీ మరోసారి వాయు కాలుష్య సమస్యతో ఇబ్బంది పడుతోంది. AQI (గాలి నాణ్యత సూచిక) 400 పైన చేరడంతో తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కాలుష్యంపై చైనా స్పందించింది. బీజింగ్ తరహాలో నివారణకు సిద్ధమని సందేశం పంపింది.
ఢిల్లీ వాయు కాలుష్యం రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. CPCB డేటా ప్రకారం, ఢిల్లీ, NCR ప్రాంతాల్లో PM2.5 కణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. పొగమంచు వల్ల రోడ్లు కనిపించకపోవడం, శ్వాసకోశ సమస్యలు పెరగడం, కళ్లు, చర్మం ఇబ్బందులు తలెత్తున్నాయి. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ సలహా ఇచ్చింది. GRAP-IV (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) అమలులో భాగంగా ఇండస్ట్రీలు మూసివేయాలని, వాహనాలు 50% తగ్గించాలని కోరింది. ఇప్పటికే స్కూల్స్ మూసివేశారు, ప్రజలు మాస్కులు ధరించి రోడ్లపై తిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో చైనా సహాయం ప్రకటించింది. భారత్‌లో చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ Xలో పోస్ట్ చేసి, “చైనా గాలి నాణ్యత మెరుగుపరచడంలో విజయాలు సాధించింది. భారత్ లో కూడా ఈ సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం” అని తెలిపారు. “ఒకప్పుడు బీజింగ్0 కూడా వాయు కాలుష్యంతో ఇబ్బంది పడింది. ఈ విషయంపై మా అనుభవాలు పంచుకుంటాం” అని చెప్పారు.
చైనా 2013-2023 మధ్య కాలుష్యం 40% తగ్గించింది. ఇందుకు ప్రధాన కారణాలు – కోల్ వినియోగం తగ్గించడం, EV వాహనాలు ప్రోత్సహం, ఫ్యాక్టరీలు తరలబాటు, కఠిన నియమాలు అమలు చేయటమే! బీజింగ్ AQI 2013లో 85, 2023లో 35కి తగ్గింది. చైనా విద్యుత్ వాహనాలు 30% పెంచింది, పవన-సౌర ఎనర్జీలో లోడ్ పెంచింది. భారత్‌కు ఈ మోడల్ సహాయకరంగా ఉంటుందని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో భారత్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి,


