- Advertisement -
ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట 18 మంది ప్రాణాలు తీసింది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు 18 మంది తొక్కిసలాటలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చివరి నిమిషంలో ప్లాట్ ఫాం మార్చినట్టు అనౌన్స్ చేయటంతో రైలు అందుకునే ప్రయాసలో ఉన్న ప్రయాణికులు తీవ్ర రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటతో ఉసురు వదిలినట్టు ఫోటోలు, వీడియోలు స్పష్టంచేస్తున్నాయి. బాధితులంతా బిహార్, ఢిల్లీ వాళ్లే.
కుంభమేళాకు వెళ్లేందుకు విపరీతమైన రద్దీ నెలకొనటంతో పలుచోట్ల తొక్కిసలాటలు, గొడవలు జరుగుతుండటం ఉత్తరాదిన నిత్యకృత్యంగా మారింది.