Tuesday, February 17, 2026
Homeనేషనల్Terrorism : ఢిల్లీ పేలుళ్ల ' వెనుక డాక్టర్ల కుట్ర.. కాఫీ సెంటర్లే లక్ష్యంగా 'వైట్...

Terrorism : ఢిల్లీ పేలుళ్ల ‘ వెనుక డాక్టర్ల కుట్ర.. కాఫీ సెంటర్లే లక్ష్యంగా ‘వైట్ కాలర్’ ఉగ్రవాదం!

Delhi Red Fort Terror Attack Investigation : ప్రాణాలు పోయాల్సిన వైద్యులే.. ప్రాణాలు తీసే యముళ్లుగా మారితే? సమాజంలో అత్యున్నత గౌరవం పొందే ‘వైట్ కాలర్’ వృత్తిలో ఉంటూ, అమానవీయ ఉగ్రవాద బాట పట్టిన ముగ్గురు డాక్టర్ల గుట్టు రట్టవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. 2025 నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా జరిగిన కారు బాంబు దాడి కేసులో లోతైన విచారణ జరుపుతున్న అధికారులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలిశాయి. ఆ రోజు డజనుకు పైగా ప్రాణాలు బలిగొన్న ఆ పాడు బుద్ధి.. అంతటితో ఆగలేదు. కేవలం భద్రతా దళాలే కాదు, మనం నిత్యం వెళ్లే గ్లోబల్ కాఫీ సెంటర్లను కూడా రక్తసిక్తం చేయాలని వారు ప్లాన్ వేశారు. 

- Advertisement -

వైట్ కాలర్ ఉగ్రవాదం: లోతైన విచారణలో విస్తుపోయే నిజాలు
లక్ష్యం.. ఆ కాఫీ చైన్ సంస్థలే : ఎర్రకోట దాడి కేసులో అరెస్టయిన జమ్మూ కాశ్మీర్‌కు చెందిన డాక్టర్ ముజామిల్ అహ్మద్ గనీ, ఆదిల్ అహ్మద్ రాథర్ మరియు ఉత్తరప్రదేశ్‌కు చెందిన షాహీన్ సయీద్‌లను విచారించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక గ్లోబల్ కాఫీ చైన్ సంస్థ అవుట్‌లెట్లను పేల్చివేయడమే వీరి ప్రధాన లక్ష్యమని తేలింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు యూదు వంశానికి చెందిన వాడు కావడమే దీనికి కారణం. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యలకు నిరసనగా, భారతదేశంలోని మెట్రో నగరాల్లో ఉన్న ఈ కాఫీ షాపులపై దాడులు చేసి అంతర్జాతీయ స్థాయిలో ఒక ‘సందేశం’ పంపాలని వీరు కుట్ర పన్నారు.

ఉగ్ర ముఠాలో అంతర్గత విభేదాలు: తమ విచారణలో నిందితులు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఎర్రకోట వద్ద కారు బాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడి మరణించిన ఉమర్-ఉన్-నబికి, ఈ ముగ్గురు డాక్టర్లకు మధ్య లక్ష్యాల ఎంపికలో విభేదాలు వచ్చాయి. ఉమర్ కేవలం జమ్మూ కాశ్మీర్‌లోని భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవాలని పట్టుబట్టగా, ఈ ‘వైట్ కాలర్’ వైద్యులు మాత్రం ఢిల్లీ వంటి నగరాల్లోని అంతర్జాతీయ సంస్థలపై దాడులు చేస్తేనే ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని భావించారు.

నాలుగేళ్లుగా నివురు గప్పిన నిప్పులా : ఈ ఉగ్ర మాడ్యూల్ నిన్న మొన్న పుట్టింది కాదు. గత నాలుగేళ్లుగా వీరు అత్యంత రహస్యంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటూ వస్తున్నారు. డాక్టర్లుగా సమాజంలో చలామణి అవుతూనే, తెర వెనుక విషపూరిత ఆలోచనలతో యువతను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వైద్య వృత్తి ముసుగులో వీరు బాంబు తయారీకి అవసరమైన రసాయనాలపై అవగాహన పెంచుకున్నట్లు అనుమానిస్తున్నారు.

నిఘా వర్గాల హెచ్చరిక: కంచే చేను మేసిన చందంగా : చదువుకున్న వారు, సమాజంలో హోదా ఉన్న వారు ఇలా ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కావడం దేశ భద్రతకు పెను సవాలుగా మారింది. “కంచే చేను మేసిన చందంగా” ప్రాణాలు కాపాడాల్సిన వారే ఇలాంటి దాడులకు పాల్పడటం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు (NIA) వీరి ఆర్థిక మూలాలను, వీరి వెనుక ఉన్న విదేశీ శక్తుల హస్తాన్ని వెలికితీసే పనిలో పడ్డాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News