Delhi Bomb Blast International Condolences : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, 25 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తమ సైతం ఉలిక్కిపడ్డాయి.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు బ్లాస్ట్ ఘటనపై ప్రపంచదేశాల నుంచి తీవ్ర దిగ్భ్రాంతి, సంఘీభావం వ్యక్తమవుతోంది. ప్రపంచ అధినేతలు, రాయబారులు భారత్ కు సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ఐర్లాండ్ ఉప ప్రధాని సైమన్ హారిస్, “ఢిల్లీ పేలుడు వార్త ఎంతో బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు మా సానుభూతి. భారత ప్రజలకు మా మద్దతు” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ALSO READ: Revanth Reddy: పాఠ్యాంశంగా ‘జయజయహే తెలంగాణ’.. ప్రతి లైబ్రరీలో ‘నిప్పుల వాగు’- సీఎం రేవంత్
చైనా రాయబారి జు ఫీహాంగ్, “ఎర్రకోట పేలుడు వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. బాధితులకు మా సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము” అని చెప్పారు. జర్మనీ రాయబారి ఫిలిప్ అకర్మాన్, “ఈ దుర్ఘటన భయంకరం. మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి మా హృదయపూర్వక సానుభూతి. భారత ప్రభుత్వానికి మా మద్దతు” అని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, “న్యూఢిల్లీ పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధిస్తుంది. బాధితుల కుటుంబాలకు మా సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము” అని ప్రకటించింది. యూకే కన్జర్వేటివ్ MP ప్రీతి పటెల్, “ఢిల్లీ వార్త భయాన్ని కలిగించింది. మృతుల కుటుంబాలకు మా సానుభూతి. బ్రిటిష్ భారత్ కు తప్పకుండా సహాయం అందిస్తుంది” అని తెలిపారు


