Thursday, July 4, 2024
Homeనేషనల్Delhi: ఆసుపత్రిలో సోనియా గాంధీ

Delhi: ఆసుపత్రిలో సోనియా గాంధీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. బ్రాంకైటిస్ తో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సీనియర్ చెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ అరుప్ బసు పర్యవేక్షణలో ప్రస్తుతం సోనియా ఆరోగ్యం మెరుగవుతోందని ఆసుపత్రి వెల్లడించింది. గురువారం రోజే జ్వరంలో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు. పలు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు గంగారాం ఆసుపత్రి స్పష్టంచేసింది. ప్రస్తుతం సోనియా వయసు 76 ఏళ్లు, ప్రస్తుతం ఆమె వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నట్టు ఆసుపత్రి వెల్లడించింది. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగించేందుకు లండన్ వెళ్లారు సోనియా కుమారుడు రాహుల్ గాంధీ.

- Advertisement -

జనవరి 5వ తేదీన అనారోగ్యంతో సోనియా గాంధీ ఇదే ఆసుపత్రిలో చికిత్సపొందారు. వైరల్ జ్వరం కారణంగా ఆమెను అప్పట్లో ఆసుపత్రిలో చేర్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News