రాజధాని ఢిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. న్యూ ఢిల్లీకి ఇద్దరు డిప్యుటీ ముఖ్యమంత్రులను నియమించే యోచనలో బీజేపీ హై కమాండ్ ఉంది. ఇలా సీఎం, ఇద్దరు డిప్యుటీలు ఉంటే మినీ ఇండియాకు ప్రతిరూపమైన హస్తినలో రాజకీయ-సామాజిక సమీకరణాలకు న్యాయం చేసినట్టు అవుతుందని కొత్త సోషల్ ఇంజినీరింగ్ మొదలుపెట్టింది. ప్రధాని మోడీ విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
బీజేపీ ఎమ్మెల్యేల భేటీ
ఆదివారం జరుగనున్న బీజేపీ ఎమ్మెల్యేల భేటీలో సీఎం అభ్యర్థిని పార్టీ ఖరారు చేయనుంది. కాగా పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, బాన్సురీ స్వరాజ్, సతీష్ ఉపాధ్యాయ, మంజీందర్ సింగ్ సిర్సా, పవన్ శర్మా, రేఖా గుప్తా, శిఖా రాయ్, రాజ్ కుమార్ భాటియా ఇలా చాలా మంది సీఎం రేసులో ఉన్నారు.