Saturday, June 14, 2025
Homeనేషనల్Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు

Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తాజాగా ఆ ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు ఖరారైంది.

- Advertisement -

ఇవాళ జరిగిన బీజేపీ కోర్‌ సమావేశంలో ఫడ్నవీస్‌ పేరుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఆయన రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 233 సీట్లను గెలుచుకుంది. ఇందులో 132 సీట్లను దక్కించుకున్న బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News