“ఫేస్ అథెంటికేషన్” ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించే విధానం :-
ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఆధార్ ఆధారంగా రూపొందించబడింది.
- పెన్షనర్/ఫ్యామిలీ పెన్షనర్ గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి యూ.ఐ.డి.ఏ.ఐ తాజా వెర్షన్ (ప్రస్తుతం 0.7.43) తో “ఆధార్ ఫేస్ ఆర్.డి (ఎర్లీ యాక్సెస్) అప్లికేషన్” కోసం వెతకాలి.
- స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ ఫేస్ ఆర్.డి యాప్‌ని విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఇది యాప్ మేనేజర్ లేదా యాప్ సమాచారం కింద ఉన్న సెట్టింగ్‌లలో కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ జీవన్ ప్రమాణ్ అప్లికేషన్ నేపథ్య ప్రక్రియ కోసం ఉపయోగించబడుతుంది, కాబట్టి దీన్ని ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి.
- ఆధార్ ఫేస్ ఆర్.డి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత , పెన్షనర్/ఫ్యామిలీ పెన్షనర్ “ జీవన్ ప్రమాణ్ ” అనే మరో అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ 3.6.3 వెర్షన్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ కొరకు ఈ దిగువన తెలిపిన సమాచారం అవసరం.
i. ఆధార్ ప్రకారం పెన్షనర్ పూర్తి పేరు
ii. పెన్షన్ రకం
iii. మంజూరు చేసిన అధికారి
iv. పెన్షన్ పంపిణీ చేయు సంస్థ
v. పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (పి. పి. ఓ) సంఖ్య
vi. ఖాతా సంఖ్య (పెన్షన్)
vii. డిక్లరేషన్‌లపై క్లిక్ చేయండి
viii. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
పై వివరాలను విజయవంతంగా సమర్పించిన తర్వాత, పెన్షనర్ ప్రామాణీకరణ సమయంలో అందించిన పింఛనుదారు మొబైల్ నంబర్‌కు ఎస్.ఎం.ఎస్. వస్తుంది. ఈ ఎస్.ఎం.ఎస్ లో ప్రమాణ్-ఐడి – డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకునే లింక్ ఉంటుంది.