Friday, January 23, 2026
Homeనేషనల్Ditwa Cyclone Updates: శ్రీలంకపై తీవ్ర ప్రభావం, 125 మంది మృతి, తమిళనాడు, దక్షిణాంధ్రలో అతి...

Ditwa Cyclone Updates: శ్రీలంకపై తీవ్ర ప్రభావం, 125 మంది మృతి, తమిళనాడు, దక్షిణాంధ్రలో అతి భారీ వర్షాలు

Ditwa Cyclone Updates: దిత్వా తుపాను దూసుకొస్తోంది. దక్షిణాంద్రవైపుకు మళ్లుతోంది. చెన్నై సమీపంలో తీరాన్ని తాకవచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇప్పటికే దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో విపత్కర పరిస్థితి నెలకొంది. 125 మంది మృత్యువాతపడ్డారు. పూర్తి వివరాలు Ditwa Cyclone Live Updates ఇలా ఉన్నాయి.

- Advertisement -

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను శ్రీలంకపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఉత్తర శ్రీలంకపై ఆవహించి ఉన్న ఈ తుపాను కారణంగా బలమైన గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా శ్రీలంకలో ఫ్లాష్‌ఫ్లడ్స్ Flash Floods in Srilanka సంభవించాయి. దిత్యా తుపాను ధాటికి శ్రీలంక తుడుచుకుపోతోందనే Srilanka Severe impact of Cyclone వార్తలు వస్తున్నాయి. తుపాను కారణంగా సంభవించిన వరదలతో శ్రీలంకలో ఇప్పటి వరకు 125 మంది మరణించినట్టు సమాచారం. భారీగా ఆస్థి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఈ తుపాను ప్రస్తుతం ఉత్తరం వైపుకు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ప్రస్తుతం జాఫ్నాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో కరైకల్‌కు 170 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 280 కిలోమీటర్లు, చెన్నైకు 380 కిలోమీటర్ల దూరంలో ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర దిశగా పయనిస్తున్నందున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిపైనే కాకుండా దక్షిణాంధ్రపై కూడా ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.

దిత్వా తుపాను తీరం దాటేది ఎక్కడ ఎప్పుడు

దిత్వా తుపాను Ditwa Cyclone చెన్నై సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పుదుచ్చేరి వద్ద తీరాన్ని తాకి చెన్నై వద్ద తీరం దాటవచ్చని అంచనా. ఇవాళ రాత్రి తరువాత తుపాను తీవ్రరూపం దాల్చవచ్చనే హెచ్చరిక ఉంది. ముఖ్యంగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు తీరం దాటవచ్చని అంచనా ఉంది. తీరం దాటిన తరువాత వాయుగుండంగా బలహీనపడనుంది. అయితే 30వ తేదీ ఉదయం ఏపీ తీరంపై తీవ్ర ప్రభావం ఉండవచ్చని అంచనా. డిసెంబర్ 1 వరకు తుపాను ప్రభావం కన్పించవచ్చు.

భారీ వర్షాలు Heavy Rains

చెన్నై సమీపంలో 20 సెంటీమీటర్లు అతి భారీ వర్షాలు పడవచ్చు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో 30వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు హెచ్చరిక ఉంది. ఈ క్రమంలో ఫ్లాష్‌ఫ్లడ్స్ ఉండవచ్చు. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 29వ తేదీన కేవలం తమిళనాడుకే రెడ్ అలర్ట్ ఉంది. రేపు అంటే నవంబర్ 30వ తేదీన మాత్రం దక్షిణాంధ్ర జిల్లాలపై ప్రభావం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. చెంగల్పట్టు, విల్లుపురం, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నెల 30వ తేదీన ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని అంచనా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News