Diving into the river for Alchippa: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కళ్‌లో ఆదివారం జరిగిన విషాదకర ఘటనలో ఆల్చిప్పలు (ముస్సెల్స్) ఏరడానికి వెళ్లిన 8 మంది మృతి చెందారు. కర్ణాటకలోని తత్తెహక్కలు నదిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తత్తెహక్కలు నదిలో వేటకు దిగిన ఓ మత్స్యకార కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్య్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ రెస్క్యూలో ఆపరేషన్‌లో భాగంగా జాలర్ల సాయంతో 8 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో 7 మంది మహిళలు, ఒకరు పురుషుడు ఉన్నట్లు జాలర్లు గుర్తించారు. వీరంతా సరదహోల్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబం లేదా బంధువుల సమూహానికి చెందినవారిగా గుర్తించారు. ఇక, నదిలో కొట్టుకుపోయిన మిగిలిన వారి ఆచూకీ కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తత్తెహక్కలు నది ప్రాంతంలో నిన్న(శనివారం) రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో నదిలో ఆల్చిప్పలు విరివిగా దొరుకుతాయి. దీంతో భత్కళ తాలూకా సిరాలి గ్రామానికి చెందిన ఓ కుటుంబం (14 మంది) ఉదయం 10 గంటల సమయంలో ఆల్చిప్పల కోసం నదిలోకి దిగారు. అదే సమయంలో నది ప్రవాహం పెరగడంతో వారిలో ముగ్గురు కొట్టుకుపోయారు. వారిని రక్షించడానికి మిగతా కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా మిగిలిన వారు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయారు. వెంటనే స్థానిక జాలర్లు నదిలోకి దిగి ముగ్గురిని రక్షించారు. అప్పటికే మిగిలిన వారు గల్లంతయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
Alchippa: ఆల్చిప్పలు ఏరేందుకు నదిలోకి దిగి.. కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

