HomeTop StoriesDK Shivakumar: డీకే శివకుమార్‌ అను నేను..! కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

DK Shivakumar: డీకే శివకుమార్‌ అను నేను..! కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

DK Shivakumar sworn in as Karnataka CM: కర్ణాటక 35వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డీకే క్యాబినేట్‌లో మొత్తం 13 మంది మంత్రులకు చోటు దక్కింది. జి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్దరామయ్యకు సైతం కేబినెట్‌లో చోటు దక్కింది. ఆయనతో పాటు యు.టి. ఖాదర్, ఎం.బి. పాటిల్, కె.జె. జార్జ్, కె.హెచ్. మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరేగౌడ, ప్రియాంక్ ఖర్గే, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్, శరణ్ ప్రకాష్ పాటిల్.. డీకే కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల తర్వాత కేబినెట్‌ను విస్తరించే ఛాన్స్‌ ఉంది. యూటీ ఖాదర్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేయగా.. ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కింది.

- Advertisement -

Also Read: CM Chandrbabu: అనవసరంగా రెచ్చగొడుతున్నారు.. పవన్‌కు మద్దతుగా చంద్రబాబు.. సంచలన కామెంట్స్‌

హాజరైన కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు..

ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు విడి సతీషన్ (కేరళ), రేవంత్ రెడ్డి (తెలంగాణ), డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, సుఖ్వీందర్ సింగ్ సుఖు (హిమాచల్ ప్రదేశ్) తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News