Saturday, November 23, 2024
Homeనేషనల్DLF: నేను చాలా లక్కీ, 91 ఏళ్లలో మళ్లీ ప్రేమలో పడ్డా: కేపీ సింగ్

DLF: నేను చాలా లక్కీ, 91 ఏళ్లలో మళ్లీ ప్రేమలో పడ్డా: కేపీ సింగ్

డీఎల్ఎఫ్ ఛైర్మన్ కుషాల్ పాల్ సింగ్ 91 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డారు. ఎప్పుడూ యాక్టివ్ గా, పాజిటివ్ గా ఉండటం చాలా అవసరం అంటూ తన ప్రేమకథపై కేపీ సింగ్ పేర్కొనటం విశేషం. ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ సంస్థ అధిపతి అయిన సింగ్ భార్య 2018లోనే క్యాన్సర్ తో మరణించింది. గుర్గామ్ లో బూమ్ సిటీ నిర్మించిన ఈయన తొలుత స్పోర్ట్స్ పర్సన్ గా ఉండి ఆతరువాత రియల్ ఎస్టేట్ రారాజుగా ఎదిగి, మనదేశంలోని ఆగర్భ శ్రీమంతుల్లో టాప్ పొజిషన్ లో వెలుగు వెలిగారు కూడా.

- Advertisement -

తాను మళ్లీ ప్రేమలో పడిన విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ.. “నేను చాలా లక్కీ, ఓ చార్మింగ్ పర్సన్ ను నేను కలిసా ఇప్పుడు ఆమె నా పార్ట్నర్, ఆమె పేరు షీనా చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది, నా జీవితంలో నేను కలిసిన అత్యుత్తమ వ్యక్తి తనే. ఈ ప్రపంచంలో తనకు చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు”. భార్యను పోగొట్టుకున్న తాను కుంగిపోరాదని మొట్టమొదట చెప్పిన వ్యక్తి ఆమెనే అంటూ కేపీ సింగ్ చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ టైకూన్ అయిన ఆయన తన భార్యను తన ఫ్రెండ్ గా గొప్పగా అభివర్ణించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News