Saturday, November 15, 2025
HomeTop StoriesDelhi Blast: లేడీ డాక్టర్ ఉగ్ర నెట్‌వర్క్.. ఈ మహిళ కథ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Delhi Blast: లేడీ డాక్టర్ ఉగ్ర నెట్‌వర్క్.. ఈ మహిళ కథ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Terrorist Shaheen Shahid arrest: వైద్య వృత్తి అనేది అత్యంత పవిత్రమైనది. డాక్టర్లను భూమిపై నడియాడే దైవంగా భావిస్తారు. సమాజంలో వైద్య వృత్తికి అంతటి గౌరవం ఉంటుంది. అయితే అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న ఓ వైద్యురాలు.. ఉగ్రవాదిగా మారింది. అంతే కాదు తన వద్ద వైద్య విద్యను నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థులను సైతం టెర్రరిస్టులుగా మార్చింది. కాలేజీ టాపర్‌గా ఉన్న ఆమె ఉగ్రవాదిగా మారడం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అయితే ఆమె ఉగ్రవాదిగా ఎందుకు మారింది.. అసలు మారడానికి గల కారణాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం.

- Advertisement -

లేడీ డాక్టర్ ఉగ్ర నెట్‌వర్క్: దేశ రాజధానిలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫరీదాబాద్‌కు చెందిన ఒక మెడికల్ కాలేజి ప్రొఫెసర్ షాహీన్ షాహిద్.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ అయిన జైష్-ఎ-మొహమ్మద్ కోసం పనిచేస్తున్నట్లు తేలింది. మసూద్ అజర్ సోదరి ఆదేశాలతో భారత్‌లో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి దాడులు నిర్వహించడమే లక్ష్యంగా షాహీన్ షాహిద్ పెట్టుకుంది. ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌కు సంబంధించిన వైట్-కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌లో ఫరీదాబాద్‌కు చెందిన మెడికల్ లెక్చరర్ డాక్టర్ షాహీన్ షాహిద్ ప్రధాన పాత్రధారిగా గుర్తించారు. దీంతో ఆమెను ఈ నెల 11న అరెస్ట్ చేశారు.

షాహీన్.. కెరీర్.. అదృశ్యం: డాక్టర్ షాహీన్ షాహిద్ నేపథ్యం: 1979లో లక్నోలో షాహిన్ జన్మించింది. ప్రయాగ్‌రాజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ చేసింది. అనంతరం కాన్పూర్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. మంచి లక్ష్యంతో వైద్య వృత్తిని మొదట్లో కొనసాగించింది. ఇలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న ఆమె తర్వాతి కాలంలో ఉగ్రవాదం వైపు ఆకర్షితురాలైంది. 2011లో ఆమెలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మార్పు మొదలైంది. కాలేజీకి సరిగా వచ్చేది కాదు. అయితే 2013లో ఆమె ఎవరికీ చెప్పకుండా ఉద్యోగానికి రావడం మానేసింది. అనంతరం ఆమె ఉగ్రవాద నిధుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న డాక్టర్ ముజమ్మిల్‌తో సంబంధాన్ని పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత 2015లో భర్త డాక్టర్ జాఫర్ సయీద్‌తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైతో సంబంధాన్ని పెంచుకుంది. ఆ తరువాతి రోజుల్లో హర్యానాలోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంతో ఆమెకు సంబంధాలు ఏర్పడ్డాయి. అక్కడి నుండే షాహీన్ షాహిద్ డాక్టర్ ముజమ్మిల్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత మసూద్ అజర్ సోదరి ఆదేశాలతో భారత్‌లో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి దాడులు నిర్వహించడమే లక్ష్యంగా షాహీన్ షాహిద్ పెట్టుకుంది.

షాహీన్ షాహిద్ అరెస్ట్‌ ఇలా: ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య నిపుణులు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై, డాక్టర్ ఉమర్ యు నబీలను పోలీసులు ఆరెస్టు చేశారు. దిల్లీ కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో వీరి పాత్ర బయటపడింది. నవంబర్ 8న డాక్టర్ ముజమ్మిల్‌ను అరెస్ట్ చేసినప్పుడు, అతని వద్ద ఏక్-47 రైఫిల్, పేలుడు పదార్థాలు దొరికాయి. విచారణలో భాగంగా షాహీన్ ప్రమేయం, జేఎం మహిళా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో దిల్లీ పోలీసులు నవంబర్ 11న డాక్టర్ షాహీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె పని చేసిన సంస్థల్లో సైతం విచారణ జరపారు. దీంతో ఉగ్ర కుట్ర బయటపడింది. షాహీన్‌ సోదరుడు డాక్టర్ పర్వేజ్ అన్సారీ సైతం వైద్యుడే. దీంతో తన కుటుంబానికి చెందిన మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్, అనేక పత్రాలను ఏటీఎస్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తన కుమార్తెకు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తనకు తెలియదని షాహీన్ తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad