భారత ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) మరో అరుదైన గౌరవం దక్కింది. డొమినికా దేశం మోదీకి తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. గురువారం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా టైం లో డొమినికాకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ అవార్డును అందజేయనున్నట్లు వెల్లడించింది.
నవంబర్ 19 నుంచి 21 మధ్య గయానాలో జరగనున్న ఇండియా – కరికోమ్ సదస్సులో ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు డొమినికా తెలిపింది. “భారత్ – డొమినికా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ ఎంతో కృషి చేశారు. 2021 ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) డొమినికాకు 70 వేల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపించారు. ఆ అపురూప కానుక వల్ల మేము మా పొరుగు దేశాలకు అండగా నిలబడగలిగాము. అంతేకాదు, ప్రధాని మోదీ నేతృత్వంలో ఆరోగ్యం విద్య అయితే రంగంలో భారత్ మాకు మద్దతుగా నిలుస్తోంది. భారత్ మాకు గొప్ప భాగస్వామ్య దేశం అందుకే ఆ దేశ ప్రధానిని మా అత్యున్నత పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించుకున్నాం” అని డొమినికా ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.