రాజధాని న్యూ ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఒక సెకెను పాటు భూమి కంపించింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయి. భూగర్భంలో 200 కిలోమీటర్ల లోపలి పొరల్లో భూకంపం వచ్చింది. 5 రోజుల వ్యవధిలో ఇక్కడ భూకంపం సంభవించటం రెండవసారి కావటంతో రాజధాని వాసులు భయంతో వణికిపోతున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించగా దాని తీవ్రత 3.8గా నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ లోని ఫైజాబాద్ ప్రాంతంలో భూకంపం సంభవించగా దాని తీవ్రత 5.9 గా రెక్టర్ స్కేల్ పై నమోదైంది.. కాగా ఆఫ్ఘన్ లో వచ్చిన భూకంప తీవ్రత ధాటికి ఢిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి.
Earth quake: ఢిల్లీలో భూకంపం, 5 రోజుల్లో రెండోసారి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES