Sunday, November 16, 2025
Homeనేషనల్Betting App Scam: బెట్టింగ్ భూతం.. గూగుల్ మెటాకు ఈడీ సమన్లు!

Betting App Scam: బెట్టింగ్ భూతం.. గూగుల్ మెటాకు ఈడీ సమన్లు!

ED notice To Google Meta: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల అక్రమ సామ్రాజ్యంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉక్కుపాదం మోపింది. ప్రముఖ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మెడకు చుట్టుకున్న ఈడీ ఉచ్చు.. ఇప్పుడు ఏకంగా టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్, మెటా సంస్థల గడప తొక్కింది. వేల కోట్ల రూపాయల మనీలాండరింగ్, హవాలా లావాదేవీలతో ముడిపడి ఉన్న ఈ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ, ఈ టెక్ దిగ్గజాలకు శనివారం నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దిగ్గజ సంస్థలకు ఈడీ ఎందుకు నోటీసులు జారీ చేసింది…? ఈ కేసుల వెనుక ఉన్న అసలు కథేంటి? వేల కోట్ల కుంభకోణంలో వీరి పాత్ర ఏమిటి..?

- Advertisement -

విచారణకు రావాల్సిందే.. ఈడీ ఆదేశం:

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుల దర్యాప్తులో భాగంగా టెక్ దిగ్గజాలైన గూగుల్ (యూట్యూబ్ మాతృ సంస్థ)  మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ)లకు ఈడీ సమన్లు జారీ చేసింది. జులై 21న తమ ప్రతినిధులతో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా ఆదేశించింది. దర్యాప్తులో ఉన్న అనేక బెట్టింగ్ యాప్‌లకు ఈ రెండు వేదికలు ప్రచారం కల్పించాయని ఈడీ బలంగా ఆరోపిస్తోంది.

ALSO READ: https://teluguprabha.net/national-news/bihar-school-under-tree-23-years/

ఆరోపణలేంటి? – ప్రకటనల ప్రాధాన్యతపైనే దర్యాప్తు:

ఈడీ ఆరోపణల ప్రకారం, గూగుల్,  మెటా తమ ప్లాట్‌ఫామ్‌లపై బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలకు, వెబ్‌సైట్‌లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. తద్వారా ఈ అక్రమ యాప్‌లు లక్షలాది మంది వినియోగదారులకు సులభంగా చేరువయ్యేందుకు దోహదపడ్డాయని ఈడీ భావిస్తోంది. ఈ ప్రచారం ద్వారానే బెట్టింగ్ యాప్‌ల నెట్‌వర్క్ విస్తరించి, వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడ్డాయని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఈ ప్రకటనల విధానాలు, వాటి ద్వారా యాప్‌లు పొందిన ప్రయోజనంపైనే ప్రధానంగా విచారణ జరగనుంది.

మహాదేవ్ యాప్ నుంచి ఫెయిర్‌ప్లే వరకు.. వేల కోట్ల కుంభకోణాలు:

ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో “మహాదేవ్ బెట్టింగ్ యాప్” కుంభకోణం అత్యంత కీలకమైనది. ఈ స్కామ్ విలువ సుమారు రూ. 6,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఈడీ ప్రశ్నించింది. అంతేకాకుండా, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఈ యాప్ ప్రమోటర్ల నుంచి రూ. 500 కోట్లకు పైగా ముడుపులు అందుకున్నారని ఈడీ ఆరోపించడం రాజకీయంగానూ పెను దుమారం రేపింది.

ALSO READ: https://teluguprabha.net/national-news/shashi-tharoor-said-i-have-some-differences-with-congress/


మరోవైపు, “ఫెయిర్‌ప్లే” అనే బెట్టింగ్ యాప్ ఐపీఎల్ మ్యాచ్‌లను చట్టవిరుద్ధంగా ప్రసారం చేస్తూ, భారీ ఎత్తున బెట్టింగ్‌ను ప్రోత్సహించింది. దీనివల్ల టోర్నమెంట్ అధికారిక ప్రసార భాగస్వామి అయిన వయాకామ్ 18 సంస్థకు వందల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లింది. ఈ కేసులో కూడా యాప్‌ను ప్రచారం చేసిన పలువురు ప్రముఖులను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. వందల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఇప్పుడు ఈ యాప్‌లకు ప్రచారం కల్పించిన వేదికలైన గూగుల్, మెటాలను ప్రశ్నించడం ద్వారా ఈడీ కేసు మూలాల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad